Thursday, June 30, 2011

పాల కూర పెసర పప్పు కూర (Spinach with Moong Dal)

ఈ పాల కుర పెసర పప్పు కూర మనం చాల తొందరగా మరియు తేలికగా చేసేసుకోవచు. మీరు ఏదన్న హడావిడిగా ఉన్నప్పుడు పాలకూర అందుబాటులో ఉన్నట్లితే ఈ కూర ప్రయత్నించి చూడండి. చాల తొందరగా చేసేయచు. నేను బాచిలర్ కావడం వాళ్ళ ఎక్కువగా ఇలాంటి కూరలు ప్రయత్నిస్తుంటాను. :)

కావాల్సిన పదార్థాలు :
పాలకూర : 3 కప్స్
పెసరపప్పు : 1/4 కప్
అల్లం+వెల్లుల్లి ముద్ద : 1/2 స్పూన్
నీళ్ళు :1 మరియు 1/2 కప్
ఉల్లిపాయ: 1
ఉప్పు కారం మీ రుచి కి తగినంత
నూనె 1 స్పూన్
పొపు గింజలు
పసుపు : 1/4 స్పూన్
ధనియాలు పొడి: 1/4 స్పూన్


తయారు చేయు విదానం:
1.పెసరపప్పుని ఒక గిన్నెలొ తీసుకుని 1 కప్ నీళ్లు పొసి ఉడికించాలి
2.పెద్ద గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టి తాలింపు పెట్టాలి
3.ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక పసుపు, ఉప్పు, ధనియ పొడి వేసి కలపలి
4.పాలకుర కుడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
5.పాలకుర ఉడికాక పెసరపప్పు కలిపి నీళ్ళు పొసి 5 నిమిషాలు ఉదికించి స్టవ్ ఆపెయలి

వేడి వేడి కూర రెడి. ఈ కూర అన్నం, చపాతి లొకి చల బాగుంటుంది.

No comments:

Post a Comment